
శృంగవరపుకోట, (జనస్వరం) : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా 3000 వేల కుటుంబాలకు తనవంతు చేయూతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30 కోట్ల రూపాయల తన సొంత కష్టార్జితం ఇచ్చి మనో ధైర్యం కల్పించారు. ఇటువంటి కార్యక్రమం ప్రజలకు తెలియజేయాలని దృఢ సంకల్పంతో శృంగవరపుకోట జనసైనికుల వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో శృంగవరపుకోట దేవిగుడి జంక్షన్ లో కౌలు రైతుల భరోసా యాత్ర పోస్ట్ ర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం 5 మండలాలకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళల పాల్గొన్నారు.