విజయనగరం ( జనస్వరం ) : ఉమ్మడి జిల్లా జనసేన- తెలుగుదేశం కో- ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి పిలుపు మేరకు విజయనగరంలోని 9 నియోజకవర్గాలలో రైతు గర్జన కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో వర్షా భావం వలన కరువు ఛాయలు అలుముకున్న వేళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం చాలా బాధాకరం తన రక్తాన్ని శ్రమగా మలిచి సేధ్యం చేసే రైతన్నకు అడుగడుగున అవరోధాలే. నెల్లిమర్ల నియోజకవర్గంలోని తోటపల్లి కాలువ వదలక పోవడం వలన సుమారు 42,000 ఎకరాల సాగునీరు అందించలేకపోయారు.ఆ కాలువకి పూర్తిస్థాయిలో మరమ్మత్తులుల తో కూడుకొని ఉంది, రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ఆనాడు సుమారు 24 వేల ఎకరాలకి త్రాగునీరు అందిస్తామని ప్రారంభించిన ప్రాజెక్టు అడ్డదారులు తొక్కుతూ ఈనాడు ఎయిర్పోర్టుకి మరియు విజయనగరానికి నీరు అందించేలా ఆ ప్రాజెక్టుని పూర్తిస్థాయిలో మార్చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం, ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి కార్యరూపం దాల్చలేదు, ఇది పూర్తిస్థాయి వైసిపి వైఫల్యమే అని మాధవి గారు ఎండగట్టారు. రైతుల పక్షపాతి అని డప్పేసుకుని వైసీపీ ప్రభుత్వం రైతుల సుభిక్షం కోసమే అంటూ ఏర్పాటు చేసిన RBK కేంద్రాలు ప్రతి ఏడాది నాణ్యతలేని విత్తనాలు ఇవ్వటమే కాకుండా సేద్యానికి అవసరమయ్యే యూరియా, పొట్టాషియం, ఫోస్పొరస్ వంటి ఫెర్టిలైజర్స్ ను అవసరానికి తగ్గట్టుగా వాడే రైతుకు ఇవ్వి ఒక క్రమ పద్ధతి లో కొనాలని మండెట్ పెట్టడం దగ్గర నుంచి, పెట్టుబడి రాయితీలు రాకపోవడం, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకపోవడం, అలాగే కార్పొరేట్ భీమా కంపెనీలకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా E- క్రాప్ వంటివాటిలో సాంకేతిక అవరోధాలతో రైతుకు పరిహారం ఎగరవెస్తున్నారు ఈ అవరోధాలు అన్నీ దాటుకొని మనకు ఆహారం అందించేందుకు రైతు వ్యవసాయం చేస్తున్న వైనం.అరకొర అదునులో ఉన్నదంతా ఉడ్చి దుక్కిపాల్జేసిన రైతన్న ఇప్పుడు వర్షాభావం వలన తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. ధరాఘాతంతో సాగుపెట్టుబడులు పెరిగిపోయి ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని వర్షా భావ పరిస్థితులు మరింత గడ్డుస్థితిలోకి నెట్టేస్తున్నాయి .
పంట పోతే చేసిన అప్పులు తీర్చలేక రైతు కుటుంబాలు కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకునే విచారకర పరిస్థితిలో రైతాంగం ఉంటే పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం. విశాఖపట్నం లో జరుగుతున్న ICID సదస్సు ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హుటాహుటిన 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకొంది వాస్తవానికి 400 లకు పైగా మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నాయి కాని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి ఈ దుందుడుకు చర్యలు. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ లో 24 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గి ప్రమాధ ఘంటలు మోగుతున్న వేళ ఇప్పుడు వచ్చిన ఈ కరువు పరిస్థితులు ఆహార ఉత్పత్తుల పైన తీవ్ర ప్రభావం ఉంటుంది నిత్యావసర కొరతలు ఏర్పడే ప్రమాదం ఉంది. మనకు ఇంతకుమునుపు వచ్చిన కరువు పరిస్థుతుల నుండి పాఠాలు నేర్చుకుని ఉండి ఉంటే పోలవరం లాంటి ప్రాజెక్టుల పూర్తిచేయడం మీద అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ మీద చెరువుల, కాలువలు మరమ్మతుల మీద ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో ఉన్న తోటపల్లి కాలువ నుంచి నీరు వదలడం మీద దృష్టి పెట్టి ఉంటే కొద్ది పాటి వర్షాలు పడినప్పటికీ ఆ నీరును వృధాపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమయ్యేవి కాని ఈ ప్రభుత్వానికి బటన్లు నొక్కడం మీద ఉన్న శ్రద్ధ రైతు సమస్యల మీద లేదు. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న 34 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి అండగా నిలబడాలి అనే నినాదంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ నియోజకవర్గం లోను రైతులతో పెద్ద ఎత్తున ప్రభుత్వంలో చలనం వచ్చే లాగా నిరసనలు తెలియచేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com