బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ చాలి చాలకుండా ఇబ్బంది పడుతున్నారని, వారికి జీవనం గడవడం కష్టంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు కుటుంబాలకి సంవత్సరానికి పది సిలిండర్లు ఉచిత గ్యాస్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.