Logo
Date of Publish : 20 August 2022, 5:36 pm
Editor : Sake Naresh

ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ తక్షణమే రద్దు చేయాలి

● అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

      అనంతపురం, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ తక్షణమే రద్దు చేయాలి. ప్రజలు పన్ను రూపంలో కట్టిన సొమ్మును లక్షల రూపాయలు జీతాలుగా తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులకు, ప్రజా ప్రతినిధులకు ఫేస్ అప్ ఎందుకు ప్రవేశం పెట్టరు? ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే అవినీతి యాప్ ప్రవేశపెట్టారు. అవినీతి చేస్తే ప్రజా ప్రతినిధులకు అవినీతి యాప్ ఎందుకు ప్రవేశ పెట్టరు? ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగులకు చేతకాని హామీలు....CPS రద్దు, న్యాయమైన PRCఅమలు చేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ చేస్తాం, ఔట్సోర్స్ ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ చేస్తాం, నిరుద్యోగులకు అన్ని ప్రభుత్వ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తాం, ఇలాంటి అనేకమైన హామీలు ఇచ్చి నేడు నెరవేర్చడానికి చేతకాక ప్రభుత్వ ఉద్యోగులను యాప్ లా పేరుతో బెదిరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు తీర్చమంటే బలవంతంగా ఒత్తిడికి గురి చేస్తూ, దౌర్జన్యంగా బెదిరిస్తూ ఉద్యోగులని ఏదో ఒక విధంగా ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తా ఉంది. స్కూల్ పిల్లలు వారి తల్లిదండ్రుల మనోగతానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా కొత్త విద్యా విధానం పేరుతో ప్రభుత్వ బడులను విలీనం చేస్తూ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఏదో విధంగా ప్రభుత్వ ఉద్యోగులని మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పైన ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయులను తమ చొప్పు చేతులో పెట్టుకొని ప్రభుత్వం తమ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కోసం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున ఉద్యమం చేసి ప్రభుత్వ మెడలు ఉంచుతామని హెచ్చరిస్తున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com