Logo
Date of Publish : 25 May 2021, 4:40 pm
Editor : Sake Naresh

జిల్లాలో ప్రజలకు తీరని అన్యాయం జరిగింది.. అఖిలపక్ష సమావేశంలో జనసేన నాయకుడు త్యాడ రామకృష్ణ ( బాలు )

                విజయనగరం జిల్లాలో కరోనా విరుచుకుపడి జిల్లా ప్రజల పై విలయతాండవం చేస్తుంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు కనీసం ప్రజలని పట్టించుకోకుండా వ్యవహరించాయని దీనివలన ప్రజలు ఆందోళనతో అక్షిజన్ అందక చచ్చిపోయారని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆరోపించాయి. కరోనా సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై లోక్ సత్తా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రతినిధి అల్లంశెట్టి నాగభూషణం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, జనసేన పార్టీ, ప్రజాసంఘాలు, పాల్గొన్నాయి. ఈ సమావేశంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ రాష్ట్రంలో విజయనగరం జిల్లా నాయకులు అందరూ కట్టకట్టుకొని అనాథ జిల్లాగా చేసారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలున్న ఈ జిల్లాలో కరోనా బాధితులు దిక్కులేని చావులతో చచ్చిపోయారని, నేటికి కూడా అక్షిజన్ అందక,బెడ్లు దొరక్క పలు ఇబ్బందులు పడుతున్నా వారు ఎందరో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకర సతీష్ మాట్లాడుతూ అధికారులు జిల్లాలో తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని కోవిడ్ ఏర్పాట్లలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ ఈస్ట్ డివిజన్ అధ్యక్షుడు కొండల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జిల్లాలో తలా తోక లేని పరిపాలన అందిస్తున్నారని కోవిడ్ బాధితులు తమ సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీఎస్పీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బిలాల్ అహ్మద్ మాట్లాడుతూ కరోనా పేరుతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచుకున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చాలా ఫిర్యాదులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినా చర్యలు లేవని అన్నారు. మరణాలు సంఖ్య కూడా సరికాదని అన్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు త్యాడా రామకృష్ణ(బాలు) మాట్లాడుతూ చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించారని, ప్రభుత్వం చెయ్యవలిసిన పనులు స్వచ్ఛంద సంస్థలు చేస్తే మరి ప్రభుత్వం ఎందుకో తమకు అర్ధం కావడం లేదని అన్నారు. నాయకుల్లాగే కొంత అధికారులు తప్పించుకు తిరిగారని డిప్యూటీ మేయర్ చనిపోయిన అధికారుల్లో చలనం లేదని అన్నారు. ప్రజా సంఘాల ప్రతినిధులు చోడి ఆదినారాయణ, మమ్ముల తిరుపతి రావు మాట్లాడుతు జిల్లాలో కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యులు పడిన అవస్థలు చూసినవారికి గుండె తరుక్కుపోతుందని నాయకులు, అధికారులు కరోనా రోగులను ఆదుకోవడంలో ముమ్మాటికీ విఫలం కావడంతో కొందరి జీవితాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని కోరారు కేంద్ర ఆసుపత్రిలో జరిగిన సంఘటన కి భాద్యులు ఎవరో నేటికీ అధికారులు చెప్పలేదని అన్నారు. ఈ సమావేశంలో పతివాడ చంద్రరావు, తాట్రాజు రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

 

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

 

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com