Logo
Date of Publish : 02 June 2022, 4:05 pm
Editor : Sake Naresh

మదనపల్లెలో పన్నుల పేరిట పేద ప్రజల నుండి దోపిడి : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

    మదనపల్లె, (జనస్వరం) : పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఒక వైపు మరోవైపు పెంచిన ఆస్తిపన్ను నిత్యవసర వస్తువులు ధరలతో ప్రజల ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే పుండుపై కారం చల్లినట్టు యూజర్ చార్జీలు(చెత్త పన్ను) మోగుతున్నాయి. ఇప్పటికే అనూహ్యంగా పెంచిన ఆస్తిపన్ను, నీటి పన్ను చెల్లించే ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలు క్లాప్ పథకం అమలుపై పెదవి విరుస్తున్నారని అనిత అన్నారు. త్వరలోనే మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పథకం కింద చెత్త పన్ను వసూలు చేయడానికి 33 వాహనాలను సిద్ధం చేశారు. మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో 35 వ వార్డులో అధికారుల లెక్కల ప్రకారం 30 వేల ఇళ్లు ఉన్నాయి. ఇందులో అధికారికంగా 1,35, 639 మంది జనాభా ఉండగా అనధికారికంగా 1.70 లక్షలు పైబడి ఉండొచ్చని అంచనా. ఇందులో 42 మురికివాడలు ఉండగా 60 వేల పైచిలుకు జనాభా ఉన్నారు. నివాస గృహాలు, నివాసేతర, వ్యాపార భవనాలు, మురికివాడలుగా పురపాలక సంఘం అధికారులు ఇప్పటికే నోటిఫై చేసారు. పురపాలక సంఘం చెత్తను తరలించడానికి వాహనాలు సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా ఈ పథకాన్ని అమలు చేయవచ్చు. దీంతో నెలకు 60 రూపాయలు స్లమ్ కేటగిరి కి 30 రూపాయలు ధర నిర్ణయించగా దీన్ని సవరించి 100 రూపాయలు 50 రూపాయలు చేశారు. పెంచిన ధరలు పన్నులతో పేద ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఈ చెత్త వేయడం చాలా అన్యాయమని వాపోయారు. నెలకు 35 లక్షలు వసూలు చేయడానికి పురపాలక సంఘం రంగం సిద్ధం చేయడం చాలా దుర్మార్గ కరమైన చర్య అని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com