విశాఖపట్నం జిల్లా, పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మాజీ సైనిక ఉద్యోగుల సంఘానికి కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ గారు తన వంతు బాధ్యతగా 50,000/-రూపాయలను త్రివిధ దళాల అధికారులు గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, భాష గారు చేతుల మీదుగా సంఘం పెద్దలు అయినటువంటి గల్లా దేవుడు గారు, వరహాలరాజు గారు, లింగం వాసు, మిద్ధి గణేష్ లకు అందజేయడం జరిగింది. శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఈ యొక్క సంక్షేమ సంఘానికి నా కుటుంబానికి సంబంధం ఉందని ఈ యొక్క సంఘం రూపుదాల్చి ఉన్న సందర్భంలో మా నాన్నగారు అయినటువంటి EX ARMY లేటు ధర్మరాజు గారు కీలకపాత్ర పోషించారని స్మరించుకుంటూ, సుమారు 150 కుటుంబాల వరకు దేశానికి సేవ చేయడంలో మన నరవ గ్రామానికి అదృష్టం దక్కిందని, ఒక ఒక సైనిక ఉద్యోగి కొడుకు అని చెప్పుకోవడంలో నాకు చాలా గర్వంగా ఉంటుందని అన్నారు. అటువంటి సైనిక కుటుంబాల సమస్యల కోసం ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం మంచి కార్యక్రమం అని చెప్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రీయ సైనిక్ బోర్డు సంక్షేమ నిధికి కోటి రూపాయలు అందజేయడం జరిగిందని గుర్తు చేసారు. అదే స్ఫూర్తితో ఈరోజు నా కుటుంబ సభ్యులు అయినటువంటి అమ్మగారు రాంబాయి, సతీమణి మీనాక్షి, కొడుకు ధర్మేంద్ర సౌర్యతో మీ యొక్క సంఘం చేస్తున్న మంచి పనులు కి నా వంతు సహాయం అందించడం జరిగిందని, ఇలాగే మన సంఘం దినదినాభివృద్ధి చెందుతూ రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి అవసరం ఉన్నా నిర్మొహమాటంగా నాకు తెలియజేయవచ్చు అని చెప్పడం జరిగింది.