
విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని ఆదేశాల మేరకు, జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ఆ ధ్వర్యంలో విజయనగరం నియోజవర్గం స్థానిక ఆబాద్ వీధిలో గల ఉర్దూ స్కూల్ ను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల రెండు రోజులపాటు పడిన వర్షానికి స్కూల్ గోడ కూలిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న నాడు నేడు అభివృద్ధి అంతా బోగస్ అని హుస్సేన్ ఖాన్ గారు మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ పుష్ప కుమారి, పద్మావతి, జనసేన నాయకులు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.