విజయనగరం, (జనస్వరం) : జనసేన ఝాన్సీ వీరమహిళ, జనసేన చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కాటం అశ్వని గారు స్థానిక 33వ డివిజన్, బాలాజీ నగర్, శ్రీనివాస జూనియర్ కళాశాల వద్ద మూడువందల వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరూ నడుంబిగించాలని, అందుకే ప్రజలందరూ మట్టిగణపతినే పూజించాలని పిలుపినిస్తూ, మన తెలుగువారు మొట్టమొదట జరుపుకొనే వినాయక చవితి పండుగను నిషేధంచడం, విగ్రహా విక్రయాలను అడ్డుకోవడం చరిత్రలోనే ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని, రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి జరుపుకోడానికి వైస్సార్సీపీ ప్రభ్యత్వానికి కోవిడ్ నిబంధనలు లేవుగాని, హిందువులు అందరూ పూజించే గణపతి పూజలకు, దానిపై ఆధారపడే కళాకారులకు ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందని, ఆఖరికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సహా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో హైకోర్టు జోక్యం చేసుకుని పండుగకు విఘ్నాలు తొలగడం ఆనందదాయకమని, ప్రజలంతా కోవిడ్ నిబంధనలతో పండుగను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు, జనసేన చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కాటం అశ్వని గారు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ అని, దానిలో భాగంగానే మట్టి వినాయక ప్రతిమలను పంచిపెట్టామని, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి,& జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళల శ్రీమతి పద్మశ్రీ దాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఆదాడ మోహనరావు గారు, త్యాడ రామకృష్ణారావు (బాలు), బూర్లీ విజయ్, కె.ఎస్.ఆర్.కుమార్, మజ్జి శివశంకర్, జనసేన మైనార్టీ నాయకులు హుస్సేన్ ఖాన్, చెల్లూరి ముత్యాల నాయుడు, రవిరాజ్ చౌదరి, రఘు, కిలారి ప్రసాద్, రవితేజ, లోక్ నాధ్, సాయి కిరణ్, తేజ, జగదీష్, పిడుగు సతీష్, ఏంటి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.