సరుబుజ్జిలి, మార్చి 18 (జనస్వరం) : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరుబుజ్జిలి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ మరియు మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్ ని గెలిపించేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం కొరకు ఇరు పార్టీల ముఖ్య నాయకులతో మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికలే లక్ష్యంగా కృషి చేస్తున్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూటమి విజయం అనంతరం సముచిత స్థానం కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పనిచేయకుండా పదవులు ఆశించకూడదని పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మం పాటించాలని, పొత్తును వ్యతిరేకించే వైసిపి నాయకుల చర్యలను తిప్పి కొట్టాలని వ్యాఖ్యనించారు. అలాగే ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com