నెల్లూరు ( జనస్వరం ) : ప్రతి ఒక్కరూ వారి వారి డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ లో ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన జనసైనికులతో కలిసి నగరంలోని అన్ని డివిజన్లో ఉన్న పోలింగ్ బూత్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిన్న, ఈరోజు ఓటర్ల స్పెషల్ క్యాంప్ నిర్వహించటం జరిగిందన్నారు. ఈ పోలింగ్ స్టేషన్లో ఓటర్ లిస్టు తో పాటు బిఎల్ఓ లు అందుబాటులో ఉన్నారా లేదా తెలుసుకోవడం జరిగిందన్నారు . ఓటర్ లిస్టులో ఓటర్ పేరు ఉందో లేదో పరిశీలించుకుని లేనియెడల మళ్లీ ఓటును నమోదు చేసుకోవచ్చన్నారు. ఎంతమంది కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు, చేర్పులు మార్పులు, తదితర విషయాలను ఆయన బిఎల్ఓల ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్, డివిజన్ ఇన్చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com