Logo
Date of Publish : 18 August 2023, 10:15 am
Editor : Sake Naresh

పర్యావరణానికి ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలి

    విజయనగరం ( జనస్వరం ) : మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం డెంకాడ మండలం, పెదతాడివాడ గ్రామ పంచాయతీలో జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవ యువత ముఖ్య ప్రతినిధి, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రముఖ సంఘ సేవకులు, మెగా ఫ్యామిలీకి మెగా వీరాభిమాని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గురాన అయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాఫ్యామిలీ అభిమానులకు ఆరాధ్యదైవం పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురష్కరించుకుని మొక్కలు నాటడం ఎంతో అభినందనీయమని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రతీ మెగా ఫ్యామిలీ అభిమాని వారివారి పుట్టినరోజు నాడు ఒక్క మొక్కైనా నాటాలని,బహుమతులుగా మొక్కలు ఇవ్వడం చేయాలని అన్నారు. అనంతరం జనసేన నాయకురాలు తుమ్మి లక్ష్మీరాజ్ మాట్లాడుతూ మా ఆరాధ్యదైవాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకొని వారి పుట్టినరోజులను హంగులు ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తుంటామని, ఈరోజు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర, యువనాయకులు మదేటి బుజ్జి, జానకిరామ్, బీ.లింగం, లక్ష్మణ్, పొన్నగంటి గణేష్,బాబు,పొంతపల్లి నవీన్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com