Logo
Date of Publish : 27 June 2023, 4:47 pm
Editor : Sake Naresh

ప్రజలందరూ హలో ఏపీ బై బై వైసీపీ అంటున్నారు

    నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 311వ రోజున 9వ డివిజన్ నవాబుపేట రామకృష్ణనగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హలో ఏపీ బై బై వైసీపీ నినాదం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతోందని, వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో ఊపిరాడక విసిగి వేసారి పోయిన ప్రజలందరికీ ఆ నినాదం ప్రాణవాయువులా పనిచేస్తోందని అన్నారు. తాము నియోజకవర్గంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలందరూ అపూర్వంగా ఆదరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది తామేనని, ఇందులో ఎటువంటి సందేహాలు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీస అభివృద్ధి కూడా లేని నెల్లూరు నగరాన్ని పవనన్న ప్రభుత్వంలో సమగ్ర అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com