కడప ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పదిమంది బలిజలు నీ పక్కన కూర్చో పెట్టుకుని ప్రెస్ మీట్ ఇవ్వలేని మీరు రాష్ట్ర కాపులంతా వైసీపీ వెంట అనడం పెద్ద జోకు అని ఏద్దేవా చేశారు. అసలు ఉపసర్పంచ్ తోటశివసాయి కాపు, బలిజల నాయకుడు ఎప్పుడయ్యాడు.. ఏ బలిజ వాడికి సహాయ పడ్డాడు… తనస్థాయి ఉపసర్పంచ్ మాత్రమే అని గుర్తుంచుకోవాలని.. పవన్ కళ్యాణ్ అనే పేరును కుడా ఉచ్చరించడానికి కుడా పనికి రాని మీకు పేదల మనిషి పవన్ కళ్యాణ్ గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని గుర్తుంచుకొంటే మంచిదన్నారు. పవన్ కళ్యాణ్ గారి వొళ్ళు ఆయన దగ్గరే ఉంది… మీ వళ్ళు రోజు ఎక్కడెక్కడ ఉందొ చెప్పడానికి సంస్కారం అడ్డొస్తోంది…. పవన్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు.. నన్ను వ్యక్తి గతంగా ప్రతిరోజు మాట్లాడే వాళ్ళకే ఈ చెప్పుదెబ్బ అని మరి మీరెందుకు మాట్లాడుచున్నారు… మీరు కుడా ఆకోవలో చేరడానికి మీరెవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారు. మీ నాయకుడు ఇస్తానన్న సంవత్ససరానికి 2వేలు కోట్లు అంటే ఇప్పటికి దాదాపు 7వేల కోట్లు ఏ కలుగులోకి దూరాయి అని ప్రశ్నించే దమ్ము మీ బానిస జీవితాలకు ఉందా అని ప్రశ్నించారు. ధైర్యము ఉంటే ఒంటరిగా పోటీ చేయమంటున్నారు…. పోటీ చేయడానికి ధైర్యము ఎందుకు? మీకూధైర్యం ఉంటే పులివెందుల వదిలి మీరు విమర్శలు చేస్తున్న గాజువాక, భీమవరం లో మీ అధ్యక్షిడిని మా నాయకుడిపై నిలబడి గెలవ మనండి…. ఒక్క కేసు కుడా లేకుండా క్లియర్ చేసుకుని పోటీ చేసే సత్తా ఉందా? మీకు ముద్రగడ పద్మనాభం మీద అంత ప్రేమ వచ్చింది ఏంటి అమాంతంగా.. ఆయన పిలుపు అందుకుని రైల్వే కోడూరు శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం దగ్గర పళ్లెం గరిటలతో వాయించి నిరసన తెలియచేసాము… అప్పుడు తమరు ఎక్కడ ఉన్నారు? నిజాయితీగా రాజకీయాలు చేయ మన్నారు… నిజాయితీ అంటే ఏంటి? మీరు నిజాయితీ అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. పంచాయతి నాన్ అప్రూవల్ ముసుగులో 14% tax వసూలు చేసి 3 నుంచి 4% పంచాయతికి మిగిలిన 10% మీ జోబులోకి అంటే ఒక ప్లాటు( ఇంటికి ) 30 నుంచి 60 వేలు నొక్కెయ్యడమే నిజాయితీ ఐతే…. RTI act ద్వారా ఇది ఎంత నిజాయితీనో మేము కనుక్కుంటామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కుక్క తో పోల్చిన మిమ్మల్ని… పంచాయతి స్వీపర్స్ కంటే ముందే వచ్చి చెత్తలో కలబెట్టే ఊరపందులు అనుకోవచ్చా అన్నారు. ఈ కార్యక్రమంలో జోగినేని మణి, పగడాల వెంకటేష్, గంధం శెట్టి దినకర్ బాబు, ముద్దపోలు సభపతి, కనుపర్తి శంకరయ్య, నగిరిపాటి మహేష్, మాదాసు నరసింహ, పగడాల శివ శంకర్, ఉత్తరాది శివ కుమార్, ఆలం రమేష్, శ్రీకారపు ప్రకాష్, సవరం సాయి, జడల సురేష్ కుమార్, అంకిశెట్టి మణి, దాసరి వీరేంద్ర, కొక్కంటి మహేష్, దరిసా బాలాజీ, పగడాల మణి ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు.