కావలి ( జనస్వరం ) : రూరల్ మండల అధ్యక్షులు తిరుపతి స్వామి ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం శ్రీరాంపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు లక్ష్మణ్, రామకృష్ణ, జయరాం ఆధ్వర్యంలో ఏన్నారై జనసేన నాయకులు కోట్టే ఉదయ భాస్కర్ సౌజన్యంతో పంపించిన జనసేన పార్టీ కేలెండర్లు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అవినీతి అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయన్ని రాష్ట్రంలో అభివృద్ధి లేక యువతకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించకపోతే మనకు భవిష్యత్తు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ జనసేన నాయకులు లక్ష్మణ్, రామకృష్ణ, జయరాం, సురేంద్ర, సాయి, మధు, సుబ్బరాయిడు, హరి, రాంబాబు, సురేష్, రమేష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com