కర్నూలు ( జనస్వరం ) : జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క జన సైనికుడు కృషి చేయాల్సి ఉంటుందని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. జనసేన పార్టీకి సమదిమించిన ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్లిల్సి ఉంటుందని ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పాల్గొనవలసి ఉంటుందని ప్రతి ఒక్క జనసేన కార్యకర్తని కలుపుకుని పనిచేస్తామని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నా ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామాలలో ప్రజల్లోకి తెలియజేయలని అన్నారు. వైసిపి పాలకులు నాయకులు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని చెబుతున్నారు. సంక్షేమ పథకాలు వలన ప్రజలకు మేలు జరుగుతుందని ఎలా చెప్పగలరని జనసేన వీరమహిళ ఎరుకుల
పార్వతి ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు వలన ఉపాధి లేని గ్రామాలలో వలసలును నివారించగలరనని అన్నారు. ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని ఇతర పట్టణాలకు నగరాలకు తరలిపోతున్నారు. కోసిగి ఎమ్మిగనూరు మంత్రాలయం, ఆదోని, ఆలూరు, హోళగుంద, కోడుమూరు మండలాల నుంచి తెలంగాణ బెంగళూరు, గుంటూరు, ముంబైలకు తరలివెళ్తున్నారన్నారు. అకాల వర్షాల వల్ల సరైన దిగుబడి లేక పూర్తిగా నష్టం వాటిల్లితే కూలీలతో పాటు సన్న చిన్న కారు రైతులు కూడా వలస వెళ్తున్నారు. సంక్షేమ పథకాలు వల్ల ప్రజల్లకు మేలు జరుగుతుందని ఎలా చెప్పగలరనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.