కదిరి ( జనస్వరం ) : కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు ఖాతాలో వ్యవసాయ బీమా డబ్బులు పడతాయి అని చెప్పి మీట నొక్కి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ వాస్తవంగా చాలా మంది రైతులకు బీమా సొమ్ము వారి ఖాతాలో జమ కాలేదు. దానికి పలు కారణాలు చెప్తున్నారు. కానీ వాస్తవానికి వ్యవసాయ అధికారుల తప్పిదాల వల్ల వారు వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకుల మాటలు విని చాలా మంది రైతులకు ఈ క్రాప్ చేయకపోవడం, దానివల్ల వారి ఖాతాలో వ్యవసాయ బీమా డబ్బులు పడలేదు. ఉదాహరణకు కదిరి మండలంలోని చిప్పలమడుగు గ్రామంలో వాలంటీర్ కు, వారి అమ్మగారికి తప్ప ఇంక గ్రామంలో ఏ రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ కాకపోవడం దీనికి నిదర్శనం. కాబట్టి ఇలాంటి ఎన్నో తప్పులు జరిగిపోయాయి. సకాలంలో వర్షాలు రాక, వర్షాలు వచ్చిన అవి అదును దాటిపోయిన తర్వాత రావడం, దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కావున ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధికారులు జరిగిన తప్పులను సరిదిద్ది వ్యవసాయ భీమా డబ్బులు ప్రతి రైతు ఖాతా లో జమచేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.