
పార్వతీపురం ( జనస్వరం ) : సభకు జనాదరణ లేకపోవడంతో ఆక్కసుతో, సభలో స్కూల్ పిల్లలు ఉన్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మతిభ్రమించిన కోతిలా జగన్ రెడ్డి గారు పెళ్లిళ్లు, పెళ్ళాల గురించి మాట్లాడుతున్నారని జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శిశ్రీ బాబు పాలూరు అన్నారు. ఆయన మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ విధానాలు, వైసిపి ప్రజా వ్యతిరేక చర్యలు గురించి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. సభకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చివరి చూపు చూడ్డానికి వచ్చారు తప్ప జగన్ మీద అభిమానంతో కాదు. కురుపాం బస్టాండ్ ఎలా అయితే ఎవరికి ఉపయోగం లేకుండా ఉందో రానున్న ఎలక్షన్ లో వైసిపి పార్టీ కూడా ఎందుకూ పనికిరాకుండా పోతుందన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి జగన్ రెడ్డి ఓ సైకోలా ప్రవర్తించడం ఆపకపోతే, ప్రజలే చీపుర్లు తిరగేసి మరీ జగన్ని వైసిపి పార్టీని తన్ని తరిమేస్తారని అన్నారు.