వాస్తవంలో అమలు చేయకపోయినా… 95 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి…? : జయరాం రెడ్డి

జయరాం రెడ్డి

      అనంతపురం ( జనస్వరం ) :  ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేకనేక హమీలను పూర్తి చేయక పోయినా… నిస్సిగ్గుగా 85 శాతం హామీలు పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీసీ సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా… మత్స్యకారుల సమస్యలను తీర్చే చేశారా… చేనేత కార్మికుల సమస్యలన్నీ తీరి పోయాయా.. కాపు సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇంతవరకు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఆర్య వైశ్యులు సత్రాలు నడిపి హక్కు వారికే ఇచ్చేసారా.. హిందూ దేవాలయాలకు 10 వేల నుంచి 85 వేల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా… ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన సమస్యలు ఎన్ని తీర్చారా.. క్రిస్టియన్‌ మైనారిటీల సమస్యలు అన్ని తీర్చే సారా సమాధానం చెప్పాలన్నారు. అగ్ర కులాల సంక్షేమం ఏమైంది.. పరిశ్రమల విషయానికొస్తే ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఫించన్ దారుల సమస్యలు, కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల  సమస్యలన్నీ పరిష్క రించారా.. నిరుద్యోగ సమస్య ఎక్కడికి వచ్చింది..వైఎస్సార్‌ రైతు భరోసా ఏంటి.. కౌలు రైతుల పరిస్థితి ఏంటి.. వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు సరైన వసతులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయా అని నిలదీశారు. వైయస్సార్‌ చేయూత కింద బీసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కాచెల్లెళ్లకు సంవత్సరానికి ‘5,000 రూపాయలు ఉచితంగా అందిస్తున్నారా అని అడిగారు… ఫీజు రియంబర్స్మెంట్‌ పరిస్థితి ఏంటి.. అవ్వతాతలకు 3 వేలరూపాయల పింఛన్‌ ఇస్తున్నారా… వైయస్సార్‌ జలయజ్ఞం పోలవరం, వెలుగొండ మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి.. పేదలందరికీ ఇల్లు ఇచ్చే, అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు తీర్చే చేశారా… ఎస్ది ఎస్సి సంక్షేమం ఏమైంది.. మెరుగైన విద్య నైపుణ్య శిక్ష శిక్షణ ఎక్కడ… జీవన బీమా 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న పౌరుడు సహజంగా మరణిస్తే వారి కుటుంబానికి వైయస్సార్‌ జీవిత బీమా పథకం ద్వారా లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారు.. ఈ పథకం అవులులో ఉందా.. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏర్పాటు చేశారా వీరికి ముఖ్యమంత్రి వైసిపి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మంత్రులు సమాధానం చెప్పిన తర్వాత 95 శాతం హామీలు పూర్తి చేశామని ప్రచారం తమకు అభ్యంతరం లేదని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way