
రంగంపేట ( జనస్వరం ) : వడిసలేరు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకేళ్లే విధంగా రూపుదిద్దారు. జనసేన నాయకులు మాట్లాడుతూ మండుతున్న ఎండల నుంచి ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో నిర్వహిస్తున్న చలివేంద్ర కేంద్రం నిర్వహిస్తూ ప్రజల యొక్క దాహాద్రి తీర్చుతున్న జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గ్రామ అధ్యక్షులు బద్దే వరప్రసాద్, రంగంపేట మండలం పార్టీ కవలపల్లి లోవ రమేష్, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.