పలాస, (జనస్వరం) : దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని పలాస మండలం అట్టుకోటా గ్రామంలో అట్టుకోట యువత సహకారంతో శ్రీ పవనపుత్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 23 మంది యువత చేయడం జరిగింది. ఈ రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసిన లిమ్మాన మధుసూధనరావు, పైల శ్రీనివాసరావు గార్లు మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియజేసారు. అట్టుకోటా సర్పంచ్ దువ్వాడ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్చందంగా వచ్చి రక్తదానం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలాస వైస్ ఎం పి పి తలగాన శ్రీరాములు, అట్టుకోట సచివాలయం సెక్రటరీ చిరంజీవి, పల్లి హరికృష్ణ, అధ్యక్షులు కొల్లి పాల్గుణరావు, ట్రెజరర్ హనుమంతు జనార్దన్, జాయింట్ సెక్రటరీ రుంకు తరకేశ్వరరావు, సలహాదారులు హనుమంతు వెంకటరావు మాస్టర్, ఫౌండర్ మజ్జి భాస్కరరావు, సభ్యులు మజ్జి హేమరావు, కుప్పాయి సునీల్, తరుణ్, ఆసపన్న బాలరాజు, అశోక్, ప్రదీప్, శ్రీను, అట్టుకోట యువత మరియు పెద్దలు పాల్గొన్నారు.