Logo
Date of Publish : 25 October 2021, 4:36 pm
Editor : Sake Naresh

పెసర్లంక గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు

            గుంటూరు ( జనస్వరం ) : కొల్లూరు మండలం, పెసర్లంక గ్రామంలో మండలంలో అన్ని గ్రామాల ప్రజల గురించి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకరంతో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 500 మంది ప్రజలు అన్ని గ్రామాల నుండి వచ్చి వైద్య సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఆదిత్య హాస్పిటల్ వైద్యుల బృందం మాట్లాడుతూ గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మరియు వివిధ రకాల డాక్టర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రజలకి బీపీ, రక్త పరీక్ష మొదలు ఈసీజీ వరకు అన్నిరకాల పరీక్షలు సకాలంలో ఉచితంగా నిర్వహించి తగు మందులు అందచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి తోడ్పాటు అందించిన గ్రామ సర్పంచ్, ఎంపీటీసి సభ్యులకు మంచాల రామకృష్ణ, కోన రామాంజనేయులు మరియు విజయవంతంగా నిర్వహించిన జనసైనికులకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మండల జనసేన నాయకులు మాట్లాడుతూ త్వరలో ఈ కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మిగిలిన గ్రామాల్లో, మండలాల్లో మళ్లీ జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కమ్మెల శ్రీనివాసరావు, పెసర్లంక సర్పంచ్ వెలివల శివనాగమణి రత్తయ్య, పెసర్లంక - పెదలంక ఎంపీటీసీ వెలివల శివసుబ్రమణ్యం, చావలి గ్రామ ఎంపీటీసీ నగేష్, పెసర్లంక గ్రామ ఉప సర్పంచ్ మరియు 10 మంది వార్డు మెంబర్లు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com