Search
Close this search box.
Search
Close this search box.

అంగన్వాడీల పై ఎస్మా వెంటనే రద్దుచేయాలి : పేడాడ రామ్మోహన్

      ఆముదాలవలస ( జనస్వరం ) : శ్రీకాకుళం పట్టణంలో ప్రముఖ ఫంక్షన్ హాల్ లో అంగన్వాడీల పై ప్రభుత్వం తెచ్చిన ఎస్మా రద్దు కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు దాదాపు నెల రోజులుగా వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రోడ్డెక్కి తెలియచేస్తుంటే, ఈ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోవడమే కాకుండా వారిపై ఎస్మా చట్టం తీసుకురావడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలింతలకు చిన్నారులకు అనేక రకాలుగా సేవలందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక తల్లిలాగా బాధ్యతగా వ్యవహరిస్తుంటే ఈ ఈ ముఖ్యమంత్రి అంగన్వాడీల పై వివిధమైన చర్యలు చేపట్టడం వారి పనితీరుకు నిదర్శనమని తెలిపారు. ఈ ఎస్ మా చట్టం రద్దు చేస్తూ అంగన్వాడీల జీతాలు పెంచాలని జనసేన పార్టీ వారికి పూర్తి సంఘీభావం తెలియచేస్తుందని ప్రకటించారు. రానున్న సరికొత్త ప్రజా ప్రభుత్వంలో అంగన్వాడీలకు పూర్తిస్థాయిలో గౌరవం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్,సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way