బొబ్బిలి ( జనస్వరం ) : రామభద్రపురం మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కు ఎదురుగా, మెయిన్ హైవేకు ఆనుకుని ఉన్న 10 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార వాణిజ్యాలకు వాడుకునేందుకు చూస్తున్న వైసీపీ నాయకుల చర్యలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ స్థలంపై ఇది వరకు ప్రజా సంఘాలు, వామ పక్షాలు మరియు జనసేన పార్టీ ఎన్నో పోరాటాలు చేసినా అక్రమార్కులు జిల్లా వైసీపీ నాయకుల అండ దండలతో వారి పనులు ఆపలేదు. జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జి గిరడ అప్పలస్వామి, జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి సభ్యులు పడాల అరుణ, జనసేన నాయకులు మహంతి ధనుంజయ, రామభద్రపురం మండలం అధ్యక్షులు భవిరెడ్డి మహేష్ ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాలు మేరకు అక్రమ కట్టడాలను స్థానిక ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు, మరియు పోలీస్ సిబ్బంది తో మాట్లాడి నిలిపివేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com