- టెన్త్ టాపర్ గుత్తా రమ్యశ్రీకి రూ. 10 వేల నగదు, ఘనసత్కారం
పుట్టపర్తి, ఏప్రిల్ 4, జనస్వరం : ముదిగుబ్బ మండలంలోని పివిఎస్ పాఠశాలలో ప్రతిభను ప్రోత్సహిస్తూ నిర్వహించిన కార్యక్రమం ప్రశంసనీయంగా నిలిచింది. 2024–2025 విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతిలో గుత్తా రమ్యశ్రీ 589 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పి. వెంగమ నాయుడు, తమ తల్లిదండ్రులు పాలెపు వెంకటసుబ్బయ్య, పాలెపు సువర్ణమ్మ జ్ఞాపకార్థం గత మూడు సంవత్సరాలుగా టాపర్గా నిలిచిన విద్యార్థులకు రూ. 10,116/- నగదు బహుమతిని అందజేస్తున్నారు. ఈ ఏడాది కూడా గుత్తా రమ్యశ్రీకి నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముదిగుబ్బ ఎంఈఓ రమణప్ప మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుచిత్ర, ప్రిన్సిపాల్ మనీషా, పిఈటి జ్యోతి యాదవ్, రమ్యశ్రీ తల్లిదండ్రులు గుత్తా లావణ్య, దామోదర్ నాయుడు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.