Logo
Date of Publish : 04 February 2022, 5:07 pm
Editor : Sake Naresh

ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి

    అనంతపురం, (జనస్వరం) : తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ స్పూర్తి అద్భుతమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఉద్యోగుల సమస్యలన్నిటిని తక్షణమే పరిష్కరించాలని జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఉద్యోగుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్న అర్థం కావడం లేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడ చేసిన తప్పే ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారన్నారు. పొరుగు సేవలు ఒప్పంద, బేసిక్ ఉద్యోగుల సమస్యలను నాడు చంద్రబాబు నాయుడు, నేడు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అప్పట్లో బాబు వస్తే జాబు వస్తుందని నమ్మబలికి తనకు అధికారం అప్పగిస్తే 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు మాట తప్పారన్నారు. నేడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మబలికి మాట తప్పడు అన్నారు. చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ ఒకటేనని ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి నిలబడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉద్యోగులు, నిరుద్యోగులు బాసటగా నిలిస్తే వారి సమస్యలని నిజాయితీగా పరిష్కరిస్తారు అన్నారు. ఉద్యోగులు నిరుద్యోగులకు ఎప్పుడు జనసేన అండగా నిలుస్తుందని.. చలో విజయవాడలో ఉపాధ్యాయ ఉద్యోగులు చూపిన ఉద్యమ స్ఫూర్తి వైసిపి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతోందన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com