ఎమ్మిగనూరు, (జనస్వరం) : దేశంలో ఏ రాజకీయ పార్టీ మనుగడ అయిన విరాళాల మీదనే ఆధారపడి వుంటుందని ఒక్క జనసేన పార్టీ నిర్వహణ భారం మొత్తం అధినేత పైనే ఆధారపడి వుందనే విషయాన్ని జనసేన కార్యకర్తలు గ్రహించి నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ అదేశాలమేరకు మండల కేంద్రమైన గోనెగండ్లలో మంగళవారం రోజు జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా, ఖాసీం సాహెబ్, మాలిక్, ఆధ్వర్యంలో అభిమానులు కార్యకర్తలకు నా సేన కోసం నా వంతు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాలిక్ మాట్లాడుతూ అభిమానమే ధనంగా భావించి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం జనాన్ని మంచి లక్ష్యంవైపు ప్రయాణించేలా కృషిచేస్తున్న గొప్ప నాయకుని అడుగు జాడల్లో నడిచే ప్రతి జనసేన కార్యకర్త పార్టీకి అండగా నిలబడి బాధ్యతగా స్వచ్చందంగా విరాళాలు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. స్కీముల పేరుతో స్కాములు చేసే రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగేలా కష్టపడి సంపాదించిన డబ్బుకు నిజాయితీగా ట్యాక్స్ చెల్లించే మచ్చలేని నాయకునికి మద్దతుగా నిలబడి, క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని అభిమానులు కార్యకర్తలు బలంగా ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేసి పార్టీకి విరాళాలు అందించేలా కృషిచేయాలని అన్నారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమం ద్వారా జనసేన పార్టీకి గూగుల్ పే, ఫోన్ పే, పేటియం,ఏదైనా ఉపయోగించి 7288040505 చరవాణికి కనీసం 10 రూ. అయిన విరాళం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాబాష, మధు, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com