ఎమ్మిగనూరు, ఏప్రిల్ 02 (జనస్వరం) : జనసేన టీడీపి బిజెపి మూడు ఉమ్మడి పార్టీల పొత్తు ధర్మాన్ని ప్రతి కార్యకర్త పాటించాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజక వర్గ ఇంఛార్జి రేఖగౌడ్ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రోజు ఎమ్మిగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆదివారం రోజు టీడీపి అధినేత చంద్ర బాబు నిర్వహించిన ప్రజాగళం సభకు ఆహ్వానం లేదనే విషయమై కార్యకర్తలు అసహనంగా ఉన్నారనే విషయాలపై ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలిపి అధిష్టానం దృష్టికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎవరు అధైర్య పడొద్ధని కలిసి పొత్తు ధర్మం పాటిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత రాష్ట్ర వికాస్ కార్యదర్శి రవి ప్రకాష్, బి,సి నాగరాజు, ఎమ్మిగనూరు నియోజక వర్గ మీడియా ఇంఛార్జి గానిగ బాషా, కర్ణం రవి, బజారి, రాహుల్ సాగర్, పవర్ స్టార్ రాజు, నందవరం మండల నాయకులు, ఎలప్ప, గోనెగండ్ల మండల నాయకులు మాలిక్, ఎమ్మిగనూరు పట్టణ నాయకులు వినయ్,పరశురామ్, వెంకటేష్, రషీద్, జనసేన కార్యకర్తలు కన్నా, అభిరామ్, అశోక్ రాజు, బజారి,వెంకటేష్ పాల్గొన్నారు.