ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఎమ్మిగనూరు పట్టణంలోని మిలటరీ కాలనికి చెందిన జనసైనికుడు సురేష్ వృత్తి రీత్యా కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు కొన్ని నెలల క్రితం విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డారు. జనసేనపార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్నందున ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖగౌడ్ గారు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పార్టీ ద్వారా నేరుగా బాధితునికి 50 వేల రూపాయలు చెక్కు అందేలా కృషిచేశారు. ఎమ్మిగనూరు జనసేనపార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ నాయకులు ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ నాయకర్ మల్లప్ప, కర్నూలు జనసేన నాయకులు ఆర్షద్, పవన్ కుమార్, అరిగేళ్ల నాగేష్, పత్తికొండ నాయకులు రాజశేఖర్, కోడుమూరు నాయకులు వెంకట్ గారి చేతుల మీదుగా 50 వేల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల సంక్షేమం కోసం ప్రాణనష్టం జరిగితే కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించి, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి 50 వేలు అందించే ఏకైక పార్టీ జనసేనపార్టీ అని కొనియాడారు. మెగా అభిమాన కుటుంబానికి వీరాభిమాని అయిన అభిమాన సంఘాల పిలుపు అందుకొని సురేష్ గారు 8 సార్లు రక్తదానం చేశారని వారికి మెగా అభిమాన సంఘం నుంచి సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. సురేష్ మాట్లాడుతూ ఆపద సమయంలో వైద్యం అందించే దగ్గర సరైన వైద్యం అందించుటకు ఇంఛార్జ్ రేఖగౌడ్ గారి సహకారం మరవలేనిదని గుర్తుచేశారు. గాయాలపాలై హాస్పిటల్ లో లక్షలు ఖర్చు చేసుకున్న ఎవరు అదుకోలేదని తను నమ్మి ప్రేమించిన అభిమానమే మొదటిసారి పరామర్శించి 50 వేలు రూపాయులు చెక్కు అందేలా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, రేణు వర్మ, మీడియా ఇంఛార్జ్ గానిగ బాషా, మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, వీరా మహిళ పద్మావతి, మండల నాయకులు ఖాసీం సాహెబ్, వెంకటేష్, షబ్బీర్, ఎల్లప్ప, మరియు తదితురులు పాల్గొన్నారు.