ఏలూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఏలూరుకు చెందిన ప్రముఖులు రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో తెనాలి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు.. పీ.ఏ.సీ.చైర్మెన్ నాదేండ్ల మనోహర వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. వీరికి రానున్న 2024 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అని దశ నిర్దేశం చేశారు.. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించాలని రానున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రెడ్డి అప్పల నాయుడు సూచించారు.. రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగురవేయడం కోసం కావలసిన ప్రణాలికను రచించడం కోసం వ్యూహాత్మకంగా ఈరోజున ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా మనమందరం కృషి చేయాలని కోరారు.. అనంతరం రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాలకు నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి రాష్ట్ర ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు సైతం దక్కకుండా వైసిపిని ఓడిస్తేనే భవిష్యత్తులో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు కూడా ఎవ్వరూ సాహసించరని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడానికి జగన్ రెడ్డి మరోసారి కుట్రలు పన్నుతున్నారని ఐతే ఈసారి మోసపోవడానికి జనం సిధ్ధంగా లేరనే విషయాన్ని గుర్తించాలని స్పష్టంగా తెలియజేశారు.. ఏలూరులో జనసేన పార్టీ తరపున అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు..