ప్రజా సమస్యలపై జనసేన పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా స్థానిక ఆర్ టి ఓ కార్యాలయం వెనుక ఉన్న సాయినాథ్ నగర్ కాలనీ నందు, గత 6 నెలలు కాలంగా పక్కా డ్రెయిన్ లేకపోవడం వలన ఉండవల్లి అపార్ట్ మెంట్ నుండి వచ్చే మురుగునీరు రోడ్ మీదకి పారుతుంది. దీనివల్లన రోడ్డు నిరుపయోగంగా మారి ఆ దారి వెంట వెళ్ళవలసిన సుమారు 50 కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కా డ్రెయిన్ లేని కారణంగా వ్యర్ధాలు పేరుకుపోయి ప్రజలు అనారోగ్యపాలు అవుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతోపాటూ, చెత్తా చెదారం పేరుకుపోవడంతో పాములు కూడా వస్తూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పడుతున్న ఇబ్బందులను పంచాయతి అధికారులకు ఎన్నిసారులు విన్నవించినా ప్రయోజనం లేక స్థానిక ప్రజలు జనసేన పార్టీ ఏలూరు ఇన్చార్జ్ రెడ్డి అప్పల నాయుడు గారి దృష్టికి తేవడంతో అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆయన, తక్షణమే అపార్ట్ మెంట్ నుండి వ్యర్ధాలను పక్కా డ్రెయిన్ ద్వార మళ్ళించే పనిని చేపట్టి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని, సానిటరీ మరియు వైద్యాధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడాలని, అసలే కొత్త కొత్త రోగాలతో సతమతమవుతున్న ప్రజలకు ఆరోగ్య భరోసా ఇవ్వాలని పంచాయతీ అధికారులను డిమాండ్ చేశారు. లేని పక్షాన ఉద్యమం మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అప్పలనాయుడుతో పాటు మండల అధ్యక్షుడు వీరంకి పండు, నగర అధ్యక్షుడు కాశీ నరేష్, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ధర్మేంద్ర, చిరంజీవి, పవన్, సాయి, కొత్త రమేష్, ఎడ్లపల్లి ఆంజనేయులు, సుందరనీడు ప్రసాద్, గొడవర్తి నవీన్, కొండేటి రమేష్, కుమార్, జాఫర్, మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com