ఏలూరు (జనస్వరం ) : రాష్ట్రంలోనూ ఏలూరు నియోజకవర్గంలోనూ ఏదైతే ప్రజల సంక్షేమం అని చెప్పుకుంటున్నారో ప్రభుత్వం గతం నుంచి వస్తున్న పెన్షన్లను ఇప్పుడు తొలగిస్తున్నారని అన్నారు.. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపంచాయితీ ,మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జీవో నెంబర్ 174 అనుసరించి సచివాలయాల నుంచి వచ్చి మీరు సంతకం పెడితేనే ఇది ఆమోదం అవుతుందని, లేదంటే మీ పెన్షన్లను పీకేస్తారని, ఆ 1000 చదరపు అడుగులు ఎక్కడిది ? ఇంతకుముందు ఇందిరా గాంధీ గారి టైంలో ఐదు సెంట్లు ఇచ్చారు.. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మూడు సెంట్లు ఇచ్చారు.. 120 గజాలు తర్వాత రెండు సెంట్లు నుండి 96 గజాలకు వచ్చిందని తర్వాత 75 గజాలకు వచ్చింది.. ఈ ఒక్క నెలలోనే దాదాపు 1500 పెన్షన్లను ఏలూరులో పీకేశారు.. అదేవిధంగా రేషన్ కార్డులను తొలగిస్తున్నారని, మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం.. అలాగే మీరు పేదవాళ్లు గనక మీకు ఈ గవర్నమెంట్ ఈ స్థలాలను ఇస్తున్నారని చెప్పి, నాగేంద్ర కాలనీలో, మారుతీ నగర్ లో, సుంకరవారి తోటలో అనేక రకాలైన ఏరియాల్లో మురికివాడలు ఎక్కడైతే ఉన్నాయో పేద ప్రజలను అక్కడికి పంపిస్తున్నారని ఎక్కడైతే ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఇళ్ళ స్థలాలను ఇచ్చిన వాటిలో భవన నిర్మాణాలు వాటిలోనే పేద ప్రజలకు ఇళ్ళను ఇచ్చి వారిని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.. ఈరోజుకి చాలామంది దాదాపు సచివాలయాలు చుట్టూ తిరుగుతున్నారని,అదేవిధంగా వాలంటరీ చుట్టూ, ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ, ఎండిఓ ఆఫీస్ చుట్టూ,ప్రతిపక్ష నాయకులు దగ్గరికి, ప్రతిపక్ష పార్టీల దగ్గరికి రోజు వాళ్ళ పనులను మానుకొని మా పెన్షన్ పోతున్నాయని మొరపెట్టుకుంటున్నారని అన్నారు.. గత 20 సంవత్సరాలుగా పెన్షన్లు తీసుకుంటున్నామని, ఇప్పుడు మా పెన్షన్లు పోతున్నాయని తెలిసి చాలా ఆందోళన చెందుతున్నారు.. ఇప్పటికైనా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ళనాన్ని బాధ్యతలు స్వీకరించాలి..ఎందుకంటే ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నారు.. వారి యొక్క సంక్షేమం కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తున్నామని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.. ఇప్పటికైనా ఏ ఒక్క పెన్షన్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.. అదే విధంగా 300 యూనిట్లు లేకపోతే ఆ ఇంట్లో ఎవరో ఒకరికి టు వీలర్ ఫోర్ వీలర్ వస్తున్నాయని వంక చెప్పి రేషన్ కార్డులు తీసేయడం, పెన్షన్లు పీకేయడం ఆ ప్రక్రియ కూడా ఏలూరులో చాలా వేౠ జరుగుతుందని దాన్ని కూడా నివారించాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.. ఈరోజు మహిళలని బలవంతంగా రుణాలను తీసుకొని ప్రక్రియ చూస్తున్నాం..మీకిచ్చిన స్థలం ఎప్పుడు నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదని ప్రభుత్వం కట్టేస్తానన్నారు..వాళ్లు బేస్మెంట్ లకి 35 వేల రూపాయలు డ్వాక్రా లోను తీసుకుని ఇవ్వమన్నారని, ఈలోగా ఈ 35000 కి వడ్డీలు కట్టుకోలేక మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని నగర ప్రజలు వాపోతున్నారు.. ఈ పరిస్థితుల్లో గెలిచిన ప్రజాప్రతినిధిగా ప్రజలకు న్యాయం చేయవలసినటువంటి ప్రజల యొక్క రక్షణగా ఉండి ప్రజల యొక్క సంక్షేమాన్ని వాళ్ళకి ఇచ్చే సంక్షేమ ఫలాలు అందించవలసినటువంటి బాధ్యత ఆళ్ళనానికి ఉందని గుర్తు చేశారు..దొంగ సాకులు చెప్పి పెన్షన్లను తొలగించడం తీవ్రంగా జనసేన పార్టీ నుండి ఖండిస్తున్నాం.. దీన్ని నివారించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు శివరామకృష్ణ ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, కోశాధికారి పైడి లక్ష్మణరావు,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, కార్యదర్శి సరళ, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు, సురేష్ వీర మహిళలు జె.సుజాత, గన్నవరపు ప్రియా రాణి తదితరులు పాల్గొన్నారు..