ఏలూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ ప్రజా సమస్యల బాట పట్టింది.. జనసేన పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ లో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జన సైనికులు పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా కాలనీలోని రోడ్లను, డ్రైనేజీలను, వీధిలైట్లను పరిశీలించారు.. కాలనీలో గ్రావెల్ రోడ్లన్నీ గుంతలు పడి, ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు జనసేన నాయకులకు వివరించారు.. అదేవిధంగా వీధిలైట్లు వెలగడం లేదని, చీకటి పడితే ఇక్కడ పార్కు కోసం కేటాయించిన స్థలం మందు బాబులకు అడ్డాగా మారిందని, కల్వర్టులపై నిర్మించిన వంతెనలు నాసిరకం గా నిర్మాణం చేయడంతో కలవద్దు వంతెనలపై వేసిన స్లాబ్లు లు పగిలిపోయి పాదచారులకు ప్రమాదకరంగా మారాయని వాసులు వివరించారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏలూరు మండలానికి రూ.50 కోట్ల రూపాయలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్ లు పనులు మధ్యలో వదిలేసారని అన్నారు.. కాలనీలో ఓ.హెచ్.ఆర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదన చేశారని, ట్యాంక్ నిర్మాణం జరగకపోవడంతో కాలనీలో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.. నగరపాలక సంస్థ పాలకవర్గం స్పందించి కాలనీలోని రోడ్లను గుంటలు లేకుండా సరిచేయాలని, అలా చేయని పక్షంలో జనసైనికులు చందాలు వేసుకుని తామే రోడ్లను సరిచేస్తామని, ఈ కార్యక్రమం జూలై 10వ తేదీలోపు నగరపాలక వర్గం స్పందించకపోతే జూలై 10న జన సైనికులు రోడ్లను సరిచేసే ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామని ప్రకటించారు.. ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు,పాలకవర్గం ఏలూరు నగరంలోని ప్రజలు ఎదుర్కునే సమస్యలపై స్పందించని పక్షంలో జూలై 10న నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు,1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ సెక్రటరి తుమ్మపాల ఉమాదుర్గ, ప్రమీల రాణి, నాయకులు వీరంకి పండు, బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, బెజవాడ నాగభూషణం, పసుపులేటి దినేష్,కోలా శివ, చిత్తిరి శివ, పొన్నూరు రాము,ఎమ్.డి.ప్రసాద్,అధత్ర సురేష్, వంశీ వేముల బాలు,మల్లపు రెడ్డి సోంబాబు, పండు స్థానిక నాయకులు రవి, బాబి, బూరాడా రము, జాని, బలగ కృష్ణ, పోతుల శ్రీనివాస్, సి.హెచ్.సాయి, నందు, పి.కృష్ణ, రామారావు, శ్రీను,వెంకటేశ్వరరావు, బి.సుధీర్, ములికి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..