• ఏలూరులో మేయర్ తో సహా ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యే ఆళ్ళనానికి బానిసలుగా పనిచేస్తున్నారు.
• సమస్యలను జనసేన పార్టీ కర్తవ్యంగా తీసుకుంటుంది.
• రోడ్డు సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్ చూపాలని డిమాండ్ చేస్తున్నాం.
• 6 వ డివిజన్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి రోడ్ల సమస్యలపై నిరశన వ్యక్తం చేసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు, (జనస్వరం) : ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏలూరు నుండి కైకలూరు రోడ్డు ఫీల్ హౌస్ పేట ఏరియా నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా చాలాసార్లుగా గోతులమయంగా రోడ్లమీద వెళ్లే వాళ్ళు స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఇళ్లల్లో కూడా ఉండలేకపోతున్నాము అని అంటే గతంలో ఈ రోడ్ల మీద ధర్నా చేయడం జరిగింది అని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. అప్పుడు మొక్కుబడిగా ప్యాచ్ వర్క్ లో చేయడం జరిగింది. నిన్న ఇక్కడ స్థానికులు రోడ్లు మీద పడుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అది మా దృష్టికి కూడా వచ్చింది. మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం నిద్ర పోతూనే ఉంది. ఇక్కడ ఉన్న మున్సిపాల్ అధికారులు కానీ, మేయర్ గాని, వీళ్లందరికీ హెడ్ గా ఉన్నటువంటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కి ఏమీ తెలియదు. ప్రజా సమస్యల అంటే ఆయనకి పట్టవు అని ఆయన అన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు రోడ్లపైన నిరసన కార్యక్రమం తెలియజేయడానికి అన్ని డిపార్ట్మెంట్ లకి ప్రజలకు తెలిసే విధంగా ఒక మెసేజ్ పెట్టామని అది తెలిసి హడావుడిగా అర్ధరాత్రి 1:00 సమయంలో మళ్లీ గ్రావెల్ చిప్స్ తీసుకువచ్చి మొక్కుబడిగా వేశారు. మళ్లీ వర్షం పడితే మళ్లీ రెండు రోజుల్లో గోతులు మయంగా అవుతుంది. దీనిని జనసేన పార్టీ తరఫునుండి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సమస్యకు పరిమినెంట్ సొల్యూషన్ చెయ్యాలని కోరుతున్నాం. పర్మినెంట్ సొల్యూషన్ కాకుండా ఇక్కడ ఉండేవారు అన్ని రకాలుగా పేదవర్గాలు ఉన్నాయి..వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. ఎవరో మాట్లాడరు. ఏం చేయలేరు వారు అని నిర్లక్ష్యంతో, మనకు ఓట్లు అయితే కావాలి గానీ, వారి అండదండలు కావాలి గాని ఇక్కడున్న సమస్యలు పరిష్కారం మాత్రం కాకూడదు. అదేవిధంగా బస్సులో ప్రయాణించే ప్రజలు కానీ ఇతర ఇతర వాహనాల్లో ప్రయాణించే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలైతే రిపేర్లు వచ్చేస్తున్నాయి. కానీ నిద్రపోతున్న ఎమ్మెల్యే కి ఇదేమి తెలియట్లేదు. ఎంతగా మేము నిరసన వ్యక్తం చేస్తున్న సమస్యలు ఉన్నాయని వ్యక్తం చేస్తున్న గానీ మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ పాలకవర్గంలో కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్లందరు కూడా ఊరికే బానిసలు లాగా ఉన్నారు ఇక్కడ ఏలూరులో ప్రజాస్వామ్యం లేదు. అందరూ కూడా బానిసల్లగా ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్నారు. వాళ్లకి స్వేచ్ఛ లేదు. మనం ఏదైనా మాట్లాడిన స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఈ సమస్యను జనసేన పార్టీ కర్తవ్యంగా తీసుకుంటుంది. ఎందుకంటే వారిని నిద్ర లేపడానికి, వారికి మాకు ఎటువంటి వ్యక్తిగత తగాదాలు ఏమీ లేవు.ఇప్పుడు కైనా స్పందించి ఈ యొక్క గోతులను పూడ్చారు..మాకు ఇది కాదు పర్మినెంట్ సొల్యూషన్ గా రోడ్లు వెయ్యాలి. ఈ రోడ్డులను పూర్తిస్థాయి నిర్మాణం చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం అని రెడ్డి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, టౌన్ సెక్రటరీ సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్ తేజ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోస పర్తి రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిత్తిరి శివ, కోలా శివ, బుద్ధ నాగేశ్వరరావు, బొండా రాము, సురేష్, తన్డ్రంగి హరీష్, పైడి లక్ష్మణరావు, జనపరెడ్డి ప్రవీణ్ తేజ, వల్లూరి రమేష్, పండు, నాని స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.