Logo
Date of Publish : 12 August 2023, 2:25 pm
Editor : Sake Naresh

విద్యుత్ ఉద్యోగుల నిరవదిక సమ్మెతో విద్యుత్తు సరఫరా నిలిపివేత

         అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్తంగా నిరవేదిక సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం వలన ప్రజలు నానా ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బుడ్డప్ప నగర్, రాణి నగర్, గౌరవ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సిబ్బంది మరియు అధికారులు వారి సెల్ ఫోన్ సిమ్ములు తీసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక 100 డయల్ కు ఫోన్ చేస్తున్నప్పటికీ నిన్నటి రాత్రి 100 డయల్ కూడా పనిచేయకపోవడం ప్రజలకు తమ ఇబ్బందులు ఎవరికి తెలపాలో తెలియక అనంతపురం జిల్లా జనసేన పార్టీ వారికి రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తమ ఇబ్బందులను వెళ్లబుచ్చుకున్నారు. విషయం తెలిసిన తక్షణమే ప్రజల ఇబ్బందులు ఇక్కట్లు గమనించి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, భవాని నగర్ సాయి కిరణ్, తేజ, ప్రవీణ్ కుమార్, జనసేన నాయకులు స్థానిక కాలనీల ప్రజలతో కలిసి అనంతపురం సెంట్రల్ పవర్ ఆఫీస్ ఓల్డ్ టౌన్ దగ్గరికి వెళ్ళగా సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యుత్ నగర్ లో ఉన్న పవర్ ఆఫీస్ కు వెళ్లగా కొంతవరకు విద్యుత్ నగర్ పవర్ ఆఫీస్ వారు కొంతవరకు సమస్యను పరిష్కరించారు. విద్యుత్ ఉద్యోగులు అధికారులు తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా ప్రజలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com