నెల్లూరు, (జనస్వరం) : కరెంటు చార్జీల మోతలు మాకొద్దు – కోతల వాతలు పెట్టొద్దు…. ఇకపై జగన్ ప్రభుత్వం మాకొద్దు…. అని ప్రజలు అనుకుంటున్నారు అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ పత్తిపాడు, జనసైనికులతో కరెంట్ ఆఫీస్ ఎస్సీకి వినతిపత్రం అందజేయడం జరిగింది. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరంలో దాదాపుగా ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచింది. కరెంటు చార్జీలు పెంచుకుంటూ సంక్షేమ పథకాల అర్హులను తగ్గించుకుంటూ పోతుంది. ప్రతి బడ్జెట్ కి కరెంటు చార్జీలు పెంచుతారని అధికారులు చెప్పారు,కానీ బడ్జెట్ నాలుగు సార్లు ప్రవేశపెట్టిన దాదాపు 8 సార్లు చార్జీలు పెంచారు. నిరంతరం పేద ప్రజలను ఉద్దరిస్తానన్నట్టు చెప్పుకునే జగన్ ప్రభుత్వం సామాన్యులకి కరెంటు చార్జీల భారం పెంచుతూ పోతుంది. గత ఏప్రిల్ లో టారీఫ్ మార్చి చార్జీలను పెంచి, ఈనెల మొదటి వారం నుంచి కమర్షియల్ యూసేజ్ కి ఏదో అదనపు చార్జీలు యూనిట్ ఒక రూపాయి పెంచి మరింత భారం మోపింది. కరెంటు కోతలను మరిచిపోయిన ప్రజలకు మళ్ళీ కరెంటు కోతలు రుచి చూపిస్తుంది. అనధికారికంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆల్టర్నేట్ గా తీస్తుంది. ఇన్వెర్టర్లను జనరేటర్లు మర్చిపోయిన ప్రజానీకం మరలా వాటి ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. సామాన్య కుటుంబానికి కూడా వెయ్యి రూపాయలు లోపల వచ్చే కరెంట్ బిల్లు వచ్చే పరిస్థితి లేకుండా చేస్తుంది. దీనిని చాకుగా చూపి సంక్షేమ పథకాలు ఏరువేత పనులో పడింది ఈ వైసిపి ప్రభుత్వం. కరెంటు కోతలను కట్టడి చేసి చార్జర్ల పెంపును నియంత్రణ చేయకపోతే జనసేనపార్టీ తరఫున నిరసనలు ఉధృతం చేసి ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, ఖలీల్, నారాయణ, వర్షన్, బాలాజీ, షారూ, ఖాసీఫ్, కేశవ తదితరులు పాల్గొన్నారు.