Logo
Date of Publish : 11 October 2023, 9:05 pm
Editor : Sake Naresh

పేదలపై విద్యుత్ భారాలు తగ్గించాలి

       శింగనమల ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బొమ్మల పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి నిలువునా కరెంటు కోతలతో 2 గంటలు లేక 4 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోందని అన్నారు. జగన్ రెడ్డి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ను విమర్శించడం, మీరు మీ మంత్రులు రైతులకు పగలు ఇస్తామన్న రైతులకు 9 గంటల కరెంటు లేదని అన్నారు. ఇప్పుడు రైతులకు పంట చేతికి వచ్చే టైం కావున రైతుల ఉసురు మీకు తగిలి మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. శీతాకాలము వచ్చినా వేసవి తలపించే గృహ విద్యుత్ బిల్లులుభారీగా వస్తున్నాయని ప్రతినెల చార్జీలు విపరీతంగా పెంచి రాష్ట ప్రభుత్వం సామాన్యులపై పెనుభారము మోపుతున్నారని అన్నారు. కావున తక్షణమే పెంచినచార్జీలు తగ్గించాలి. ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు ఇతర భారాలు రద్దు చేయాలన్నారు. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలి. ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ వరకు ఉచితంగా ఇవ్వాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  విద్యుత్ సవరణ బిల్లు - 2022ను ఉపసంహరించుకోవాలని కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com