Logo
Date of Publish : 31 March 2026, 8:53 am
Editor : Sake Naresh

ఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక

- ఘనంగా ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధమ మహాసభ

- ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు

- జర్నలిస్ట్ సేవలు మరువలేనివి ఎమ్మెల్యే బడేటి

- ఏపీ బీజేఏ అధ్యక్ష కార్యదర్శుగా
పి.నారాయణ, ఎం.కిరణ్

ఏలూరు, మార్చి 30 (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీబీజేఏ) ఏలూరు జిల్లా మహాసభను ఏలూరులోని పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం భవనంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఎస్.డి. జబీర్, కార్యదర్శి వై.వి. హరీష్ ఆధ్వర్యంలో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని, ప్రజల సమస్యలను వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులకు తగిన గౌరవం దక్కాలని, ఏలూరులో జర్నలిస్టుల సొంత ఇళ్ల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మీడియా జిల్లా కార్యాలయం ఏర్పాటు కోసం కూడా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ, మీడియా స్వతంత్రతకు భంగం కలిగించే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా, పెంట నారాయణ, ఎం. కిరణ్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పి. సుమన్, డి. సత్యనారాయణ, కోశాధికారిగా డి. దాస్, సహాయ కార్యదర్శిగా భాషతో పాటు మరికొంతమంది ఈసీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు బాలశౌరి, ఇక్కెడేషన్ కమిటీ సభ్యులు శంకర్రావు, కళ్యాణ్, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com