• ప్రజలు ఓటు బటన్ నొక్కి జగన్ ని ఇంటికి పంపడానికి సిద్దంగా ఉన్నారు
• సంక్షేమం,అభివృద్ధి సమపాలనలో జరగాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యం
• దగ్గుపాటి ప్రసాద్ కు మద్దతుగా 44వ డివిజన్ లో ప్రచారం
అనంతపురం, ఏప్రిల్ 13 (జనస్వరం) : శనివారం నాడు అనంతపురం అర్బన్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ కు మద్దతుగా జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోను వివరిస్తూ ఓటుని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంచేసి బటన్లు నొక్కడమే అభివృద్ధి అనుకుంటున్నాడని ఈ విధానం వల్ల రాష్ర్టంలో ప్రతి వస్తువు ధర పెరిగి రాష్ర్టంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి మధ్యతరగతి ప్రజలు బ్రతుకులు వెళ్ళదీసేదే చాలా కష్టంగా ఉందని తెలిపారు. అది కాకుండా జగన్ రెడ్డి నొక్కే బటన్ డబ్బులు సరైన పద్దతిలో లబ్ధిదారులకు పడడం లేదని నియోజకవర్గ మహిళలు ప్రతి ఒక్కరూ నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారనీ దీనికి తోడు జగన్ పరిపాలన నియంత పోకడలకు పోయి ఎమ్మెల్యే లను రోబోలుగా తయారు చేసి నియోజక వర్గాల అభివృద్ధిని క్షీణింప చేశాడని దీనివల్ల ఏ డివిజన్, పంచాయితీలలోకి వెళ్లిన ప్రజలు తీవ్ర మౌలిక సదుపాయాల కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తు స్థానిక డివిజన్ లో మురుగు కాలువలు, మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో జరగాలంటే జనసేన టిడిపి పార్టీలకు ఓటు వేసి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్ చింతా భాస్కర్, ముత్యాల రంగా రఘునాథ్, జనసేన నగర కమిటీ సభ్యులు విశ్వనాథ్, పెండ్యాల చక్రపాణి, అంజి, శ్రీనివాస్, తలారి మహేంద్ర, అనిల్, శ్రీనాథ్, షబానా, అంకె చలపతి, రాఘవేంద్ర, వీర మహిళలు గురు లక్ష్మి, సరోజమ్మ, గాయత్రి తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com