పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ నియోజకవర్గ నాయకులు C రాజశేఖర్ ప్రజా పోరాట యాత్ర గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. మధపురం, కర్లకుంట, అమకతాడు, రామకృష్ణపురం, యస్ హెచ్ యర్రగుడి, మన్యంకుంట, యర్రబాడు, భాపనదొడ్డి, మాధపురం గ్రామంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ మాదాపురం గ్రామంల రేషన్ డెలివర్ సరిగా అందడం లేదని, స్కూళ్లో పెచ్చులు ఉడి కింద పడిపోతున్నాయని అన్నారు. పిల్లల ప్రాణాలకు హానికరంగా ఉందన్నారు. కర్లకుంట జగదుర్గి వరకు రోడ్డు కావాలని గ్రామస్తులు వాపోయారు. పుట్లూరు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదని, విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని, అలానే పెద్దలు మూడు కిలోమీటర్లు వరకు కాలి నడకన నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యను వెంటనే తీర్చాలని ప్రజలు కోరుతున్నారన్నారు. గోరంట్ల నుండి యస్ హెచ్ యర్రగుడికి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని హంద్రీ బ్రిజ్ వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. మన్యంకుంట గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు అలానే వాటర్ ట్యాంక్ సమస్యలు వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణగిరి మండలం నాయకులు నాగేశ్వరరావు, కాల్వ భాస్కర్, తిరుపాల్, ఎర్రిస్వామి, వడ్డే వీరేశ్, వెంకట్రామూడు, రవి, మద్దిలేటి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.