గుంతకల్లు, మార్చి22 (జనస్వరం) : జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పై తన అంతులేని అభిమానాన్ని చాటుతూ గుంతకల్ పట్టణ వీర మహిళ ఈరమ్మ జనసేనానీ టాటూ తన చేతి మీద ముద్రించుకుంది. ఈ విషయాన్ని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠకి చూయిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ వీరమహిళ ఈరమ్మ కు కళ్యాణ్ పై గుండెల్లో గూడు కట్టుకున్న తన అభిమానాన్ని చేతిపై శాశ్వతంగా పచ్చబొట్టు వేసుకోవడాన్ని చూస్తుంటే గర్వంగా ఉందని, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నిస్వార్థమైన, నిజాయితీ నాయకుడు కళ్యాణ్ అని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని పని సుమారు 3000 వేల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉంటూ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ అలా 30 కోట్లు దానం చేసిన అభినవ కర్ణుడు కళ్యాణ్, అంతేకాకుండా ఎంతోమంది, యువతి యువకులను సామాజిక బాధ్యతతో రాజకీయాల పట్ల ఆకర్షితులను చేసిన ఏకైక వ్యక్తి జనసేనాని అని తెలిపారు. అందువల్లే ఆయనకు అభిమానులు ఉండరు, అందరూ భక్తులే ఉంటారు అనడానికి వంద శాతం నిదర్శనం మా గుంతకల్ వీర మహిళ ఈరమ్మ అని కొనియాడారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com