Logo
Date of Publish : 22 February 2026, 1:31 am
Editor : Sake Naresh

క్రీడాస్ఫూర్తితో రాణించాలి : విద్యావేత్త గొర్తి వెంకట్ పిలుపు

అనంతపురము, ఫిబ్రవరి 21 : యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రమశిక్షణతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కక్కలపల్లి పాఠశాలలో విద్యార్థులకు చెస్, క్యారం వంటి ఇండోర్ గేమ్స్ ను హెడ్మాష్టర్ ప్రారంభించారు. జీవితంలో లక్ష్యాలను సాధించడానికి, ఉన్నత శిఖరాలకు చేరడానికి క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమన్నారు. క్రీడలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, ఏకాగ్రతను పెంచుతాయన్నారు. ఆటలో గెలుపు కంటే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం చాలా ముఖ్యమన్నారు. ఓడిన వారు నిరుత్సాహపడకుండా, మరోసారి గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు.క్రీడలు లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు వాటిని సాధించే దిశగా కృషి చేయడం నేర్పుతాయన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ జిల్లా, రాష్ట్ర స్థాయిలలో రాణించి, మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర" కార్యక్రమాన్ని కూడా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ నెల థీమ్ "జీరో లిటర్ గవర్నెన్స్" గురించి అవగాహన కల్పించారు. తడి - పొడి చెత్త వేరువేరు సేకరణ, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాముఖ్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com