
మాతృభాషలో విద్యా బోధన – ఆవశ్యకత
పిల్లలకు విద్యాబోధన మాతృభాషలో చేయాలా లేక ఇంగ్లిష్ మీడియంలోనా? ఈ అంతులేని చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక కూడా ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లాన్ని విద్యాబోధన మాధ్యమంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాయి. అందుకు అనుగుణంగా, ఈ విద్యా సంవత్సరం నుండే ఆంగ్ల మాద్యమంలో బోధన ప్రారంభించటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ఈ అంశం మరోసారి వివాదాంశంగా మారి చర్చకు కారణమైంది.
మాతృభాష అంటే ఏమిటి? :
శిశువు తాను పుట్టినప్పటి నుండి తన తల్లిదండ్రులు మరియు ఇరుగుపొరుగు వారి నుండి ఏ భాషను వింటూ, ఏ ఇబ్బంది లేకుండా తన్మయత్వంగా నేర్చుకుంటూ ఉంటాడో, ఆ భాషను మాతృభాషగా పరిగణించవచ్చు. మనం మొట్టమొదట నేర్చుకునేదీ, బాగా ఎక్కువగా మాట్లాడేదీ, ఎక్కువ సందర్భాల్లో వినియోగించేదీ, భావావేశ, లేదా హృదయా నుగత సంబంధం కలిగినదీ, లెక్కించడం, ఆలోచించడం, కలలు కనడం లాంటి వాటికి ఉపయోగించేదీ మాతృభాష. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు. జపాన్, ఐర్లాండ్, పోలాండ్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతోంది. చైనా, పిల్లలకు తొమ్మిది సంవత్సరాల వయసు లేదా మూడవ గ్రేడ్ లో పరాయి భాషను, బోధనా భాషగా ప్రవేశ పెడుతోంది.అది కూడ వారానికి రెండు గంటలు మాత్రమే.
ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350 ఎ), కొఠారీ కమిషన్ చెప్పింది. యునెస్కోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెబుతున్నాయి. వస్తూత్పత్తిలో అత్యధికాభివృద్ధిని సాధించిన జపాన్ అత్యున్నత స్థాయి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలుచేస్తోంది. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది. నూతన జాతీయ విద్యా విధానం (2020) కూడా ఐదవ తరగతి వరకు మాతృభాష లోనే బోధన జరగాలి అని చెబుతోంది. అంతర్జాతీయ సంస్థలన్నీ- యునెస్కో, వరల్డ్‌బ్యాంక్, వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషనల్ ఫరాల్ (ఎఫ్‌ఎఫ్‌ఏ) జనరల్ అసెంబ్లీ లాంటి సంస్థలన్నీ పిల్లలకు ప్రాధమిక విద్యని మాతృభాషలో నేర్చుకునే హక్కుందని నిర్ధారించాయి. ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, ప్రజాజీవనాన్ని భాష ప్రతిభింబిస్తుంది. ప్రతిభింబిస్తుంది. భాష కేవలం భావవ్యక్తీకరణ, భావ ప్రకటన సాధనంగానేకాక, భావాలను సమైఖ్యపరిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి దోహదం చేస్తుంది. పరిపాలన నిర్వహించడానికి ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అత్యధిక సంఖ్యాకులు మాట్లాడేభాష, అధికారభాష అవుతోంది. అటువంటి అధికారభాష గా మాతృభాష ఉంటే ఇంకా మంచిది.
బోధన మాధ్యమంగా మాతృభాషప్రయోజనాలు:
పిల్లలు మరింత మెరుగ్గా తొందరగా అవగాహన చేసుకొని నేర్చుకుంటారు . పాఠశాలలో ఎక్కువగా గడపడాన్ని పిల్లలు ఆనందిస్తారు. పిల్లలలో అత్మనిబ్బరం పెరుగుతుంది మాతృ బాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభ్యసించడం సులభం.
మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు. మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి. మాతృభాష మాధ్యమం వల్ల అధ్యయనం చురుకుగా సాగుతోంది. సామాజిక స్పృహ పెంపొందుతుంది. పిల్లలు అదే పాఠశాలలో ఎక్కువ కాలం (పదేపదే పాఠశాలలు మారకుండా) చదవటానికి ఇష్టపడతారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరుగుతుంది. పాఠశాల కృత్యాలలో తల్లిదండ్రుల సహకారం పెరుగుతుంది. మాతృభాష మాధ్యమంలో విధ్యార్ధులకు అభ్యసనం క్రీడలాతోచి మానసికశ్రమ, అలసట లేకుండా ఉల్లాసంగా వివిధ విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మాతృభాషా మాధ్యమంలో చదవడంవల్ల ఆ భాషకు తగిన గౌరవం కల్పించిన వారమవుతాం.
కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సిఆర్‌ఎస్) ఆర్టికల్ 29, 1ఓ సెక్షన్ 269లో ఆర్టికల్ 29 ప్రకారం మాతృభాషలోనే నేర్చుకునే తెవివితేటలు ఎక్కువగా వుంటాయని స్పష్టం చేశారు. అందుకని దాని ద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ వుందని నిర్ధారిస్తున్నాయి. ఏ భాషని మాధ్యమంగా విద్య గరిపించాలనుకుంటున్నామో ఆ భాషని ముందు క్షుణ్ణంగా నేర్పాలి. అందుకు పిల్లలకున్న భాషాపర హక్కుని గుర్తుంచుకోవాలి. డాకర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ (2000) వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (1990) యునెస్కో లాంటి సంస్థలు పిల్లల భాషాపర హక్కుని తెలియజేస్తున్నాయి. మాతృభాషలో చదువు చెప్పడం, పిల్లలకు వాళ్ల జాతి సంస్కృతుల్ని చెప్పడం కూడా అంటున్నారు భాషా శాస్తజ్ఞ్రులు. ఇలా ఎందరో పరిశోధకులు, శాస్తజ్ఞ్రులు మాతృభాషా ప్రాధాన్యాన్ని చెబుతున్నారు పాఠశాలలో ప్రారంభ దశలో! ఈ విషయాల్ని మిగతా పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యాబోధనా పద్ధతుల్ని నిర్మించాలి. తల్లిదండ్రులు కూడా ఆ దిశలోఆలోచించాలి.
బోధన మాధ్యమంగా మాతృభాషప్రయోజనాలు:
పిల్లలు మరింత మెరుగ్గా తొందరగా అవగాహన చేసుకొని నేర్చుకుంటారు . పాఠశాలలో ఎక్కువగా గడపడాన్ని పిల్లలు ఆనందిస్తారు. పిల్లలలో అత్మనిబ్బరం పెరుగుతుంది మాతృ బాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభ్యసించడం సులభం. మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు. మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి. మాతృభాష మాధ్యమం వల్ల అధ్యయనం చురుకుగా సాగుతోంది. సామాజిక స్పృహ పెంపొందుతుంది. పిల్లలు అదే పాఠశాలలో ఎక్కువ కాలం (పదేపదే పాఠశాలలు మారకుండా) చదవటానికి ఇష్టపడతారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరుగుతుంది. పాఠశాల కృత్యాలలో తల్లిదండ్రుల సహకారం పెరుగుతుంది. మాతృభాష మాధ్యమంలో విధ్యార్ధులకు అభ్యసనం క్రీడలాతోచి మానసికశ్రమ, అలసట లేకుండా ఉల్లాసంగా వివిధ విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మాతృభాషా మాధ్యమంలో చదవడంవల్ల ఆ భాషకు తగిన గౌరవం కల్పించిన వారమవుతాం.
కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సిఆర్‌ఎస్) ఆర్టికల్ 29, 1ఓ సెక్షన్ 269లో ఆర్టికల్ 29 ప్రకారం మాతృభాషలోనే నేర్చుకునే తెవివితేటలు ఎక్కువగా వుంటాయని స్పష్టం చేశారు. అందుకని దాని ద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ వుందని నిర్ధారిస్తున్నాయి. ఏ భాషని మాధ్యమంగా విద్య గరిపించాలనుకుంటున్నామో ఆ భాషని ముందు క్షుణ్ణంగా నేర్పాలి. అందుకు పిల్లలకున్న భాషాపర హక్కుని గుర్తుంచుకోవాలి. డాకర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ (2000) వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (1990) యునెస్కో లాంటి సంస్థలు పిల్లల భాషాపర హక్కుని తెలియజేస్తున్నాయి. మాతృభాషలో చదువు చెప్పడం, పిల్లలకు వాళ్ల జాతి సంస్కృతుల్ని చెప్పడం కూడా అంటున్నారు భాషా శాస్తజ్ఞ్రులు. ఇలా ఎందరో పరిశోధకులు, శాస్తజ్ఞ్రులు మాతృభాషా ప్రాధాన్యాన్ని చెబుతున్నారు పాఠశాలలో ప్రారంభ దశలో! ఈ విషయాల్ని మిగతా పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యాబోధనా పద్ధతుల్ని నిర్మించాలి. తల్లిదండ్రులు కూడా ఆ దిశలోఆలోచించాలి.
పరభాషల్లో శిక్షణ:
అభ్యాసకుని మొదటి భాష (మాతృభాష) ద్వితీయ భాష నేర్చుకోవటం లో ముఖ్య కారకం. మొదటి భాష, రెండవ భాష నేర్చుకోటంలో చేతనంలో గాని, ఉపచేతనంలో గాని ఒక వనరుగా సహకరిస్తుంది. మొదటి భాష cotributing factor గా ఉంటే, రెండవ భాష development factor గా ఉంటుంది మాతృ భాషలో చదవడమూ, రాయడమూ వచ్చాక, ఇంకే భాషనైనా నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. అవసరాన్నిబట్టీ, ఇష్టాన్ని బట్టీ, అవకాశాన్నిబట్టీ ఇతర భాషలు నేర్చుకుంటాం. ప్రస్తుతం (గత రెండు వందల ఏళ్లుగా) మన దేశపు విద్యావంతులకి ఇంగ్లీషు పట్ల, కూపర్ అనే భాషా శాస్త్రజ్ఞుడి మాటల్లో చెప్పాలంటే ‘ఆకలి’ (హంగర్), ‘అశ్లీలమైన వ్యామోహం’ (ఇండీసెంట్ హంగర్) పెరిగిపోయింది. ఈ ఇంగ్లీష్ “యావ” మన దేశంలో ఎనబైవ దశకం చివరిలో, తొంబైవ దశకం ప్రారంభంలో మరింత ఉదృతం అయ్యింది. దీని వలన ఇంగ్లీషు వస్తే చాలు పెద్దపెద్ద జీతాలతో ఉద్యోగాలు వచ్చేస్తాయనే భ్రమలూ ఉన్నాయి. ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో కూడా నిరుద్యోగం విస్తృతంగా ఉందనే నిజాన్ని గుర్తించనంత భ్రమలో నేటిసమాజం, ప్రజలు ఉన్నారు.
ఆంగ్ల మాధ్యమ విద్య :
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. గత విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమమే అయినప్పటికీ తెలుగు కూడా పాఠ్యాంశం గా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకతతో పాటు మరికొన్ని సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ పెట్టుకుని ఈ విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక స్థాయి వరకు పూర్తి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసి ఏడాదికి ఒక తరగతి చొప్పున ఆంగ్ల మాధ్యమాన్ని పెంచుకుంటూ పోవాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. శాస్ర్తియ అధ్యయనం లేకుండా తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసి, తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తున్న 26 లక్షల మంది విద్యార్థులపై ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్ది, నిర్బంధం చేస్తూన్న ఈ నిర్ణయాన్ని కూడా అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ప్రాథమిక స్థాయి వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన చేసి 6వ తరగతి తరువాత ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండింటినీ కొనసాగిస్తే ఎవరికి ఇష్టమైన మాధ్యమంలో వాళ్లు విద్యాభ్యాసం చేస్తారనేది అనేకమంది వాదన. నిరుద్యోగానికీ, ఆయా దేశ ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాలకీ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని అమాయకత్వం విడనాడాలి, ప్రతిభకు తప్ప భాష ప్రాతిపదికగా ఉద్యోగాలిచ్చే ప్రాధాన్యం ఉండదు, అని గుర్తించాలి. ప్రసిద్ధ నటుడు బల్రాజ్ సాహనీ (పంజాబీ) విశ్వకవి రవీంద్రుణ్ణి ఉడికించడం కోసం సంభాషణకు దిగాడు. టాగూర్ అడిగారు, ‘ఇంతకీ నీదేభాష?’ ‘పంజాబీయే గానీ, అందులో చెప్పు కోదగిన సొగసు లేదు. అందుకనే ఇంగ్లిష్ రాస్తాను’ అన్నాడు బల్రాజ్. ‘నీవు పంజాబీని కించపరుస్తావా? గురునానక్ లాంటి మహాకవిని, గ్రంథకర్తను పంజాబీ భాషా సౌందర్యానికి హారతులందించిన విశిష్ట వ్యక్తిని కాదంటావా? తప్పు తప్పు. ఎంత ఇంగ్లిష్‌లో రాసినా నీది పంజాబీ మాధుర్యం సోకగల రచన కాదు. నా రచనలన్నీ మొదట బెంగాలీలోనేగానీ, ఇంగ్లిష్‌లో కాదు. నేను బెంగాలీ నుంచే ఇతర భాషల వారి కోసం ఇంగ్లిష్‌లో చేస్తానేగానీ.. ఎంత లేదన్నా తల్లిభాష తల్లిభాషే, పరాయి భాష ఎంత తురాయి కట్టుకున్నా పరాయిదే సుమా!’’ అన్నాడు విశ్వకవి. మాతృభాష లో వ్యక్తీకరణకు ఉన్న ప్రాధాన్యత అటువంటిది.
సుప్రసిద్ధ అమెరికన్ భాషా శాస్త్రవేత్త నోవం చామ్స్కీ వాదన ప్రకారం విద్యార్ధికి 15 నుండి 20 సంవత్సరాల వరకు మాతృ భాషలో బోధన జరిపిన తరువాత మాత్రమే ఎదైనా ఇతర భాష భోధనభాషగా ప్రవేశ పెడితే అతడు తన అభ్యసనను సులభంగా సాగించగలడు. Indian education will collapse if, Mother tongue is not as a medium of Instruction అంటున్న ప్రొఫెసర్ జోగా సింగ్ (Professor, Punjabi University, Punjab) వంటి పెద్దల మాటలను పెడ చెవిని పెట్టకుండా, బోధనా భాషగా, మాతృభాష అమలుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో వ్యవహరించాలి.
“ మాతృభాష బోధన ద్వారా గరపని (నేర్వని)ప్రాధమిక విద్య అసలు విద్యే కాదు ”
– మహాత్మా గాంధీజీ
By
ఆర్. ఎ. స్వామి
ట్విట్టర్ ఐడి : @Ego_id5050