రోడ్డు సమస్యను పరిష్కరించాలని ఎచ్ఛర్ల జనసైనికుల ధర్నా
ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం మురపాక పంచాయతీ పరిధిలోని చిన్నయ్య పేట గ్రామ సమస్యల పైన ఈరోజు జనసేన నాయకులు మీడియా సమక్షంలో పోరాటం చేయడం జరిగింది. చిన్నయ్య పేట గ్రామంలో సుమారు 300 ఇల్లు 800కు పైగా ప్రజలు నివసిస్తున్నారు. అధిక జనాభా భవన నిర్మాణ కార్మికుల గానూ, రోజు వారి కూలీ కి గాను సుమారు 200 మంది కి పైగా కూలీలు శ్రీకాకుళం పనికి వెళుతూ ఉంటారు. అలాంటి గ్రామానికి వెళ్లి రావడానికి కనీసం రోడ్డు వసతి కూడా లేదు, డ్రైనేజీ సమస్య మరీ అధ్వానంగా ఉంది. ముఖ్యంగా వాటర్ కాలుష్యం కారణంగా ఆ గ్రామంలో ఫ్లోరైడ్ కారణంగా కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వాలు మారుతున్న స్థానిక నాయకులు కానీ ప్రభుత్వ౦ గాని పట్టించుకోవడం లేదు. జనసేన నియోజకవర్గ నాయకులు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి నేటికీ ఇలాంటి గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. పల్లెటూరు లే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్తున్నా సరే ఇలాంటి గ్రామాన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపైన పోరాటానికి జనసేన ముందు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లావేరు మండలం జనసేన నాయకులు విజయ్ కృష్ణ గారు, జి. సిగడం మండల జడ్పిటిసి అభ్యర్థి భూపతి గారు, రామకృష్ణ గారు, రణస్థలం మండలం నాయకులు చిరంజీవి గారు, ఎచ్చెర్ల మండలం జడ్పిటిసి అభ్యర్థి తమ్మినేని శ్రీనివాస్ గారు, ముఖ్య నాయకులు మధుబాబు గారు, స్థానిక గ్రామ జనసేనా కార్యకర్తలు లెంక గోపాల్, రాజేష్, ఈశ్వరరావు, సురేష్, హరి, ప్రశాంత్, రమణ, శ్రీను, గోవిందా, అసిరి నాయుడు, శేఖర్, అప్పన్న రమణ, భాస్కర్, జగదీష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.