
జనసేన కార్యకర్త రోపయవలస భాస్కరరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి క్రాంతి శ్రీ
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని పతివాడపాలెం గ్రామంలో జనసేన కార్యకర్త విద్యుత్ షాక్ గురి అయి చనిపోయిన రోపయవలస భాస్కరరావు కుటుంబాన్ని ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి క్రాంతి శ్రీ గారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వర్ధంతి లో పాల్గొని భాస్కరరావు తల్లి గారికి మనో ధైర్యం చెప్పి జనసేన ఎప్పుడు కూడా తోడు ఉంటుందని తెలియజేసి వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేశారు. జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 650 ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. జనసేన కార్యకర్తలు ఎవరూ బాధల్లో ఉన్నా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే జనసేన నాయకులు Dr విశ్వక్సేన్, పొట్నూరు రమణమ్మ, తాలబత్తుల పైడిరాజు, శంకర్, లక్ష్మీనాయుడు బాబాజీ, దుర్గారావు, జయప్రకాష్, సాయి, జనసేన కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొని సంతాపం తెలిపారు.