Logo
Date of Publish : 27 November 2021, 4:03 pm
Editor : Sake Naresh

అంగన్వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పిల్లలను పరామర్శించిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీమతి కాంతి శ్రీ గారు

    ఎచ్చెర్ల, (జనస్వరం) : లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో నేతేరు అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు, పాలు తీసుకోవడంతో పదిమంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి మరుక్షణం గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకొని బాధిత పిల్లలని, వాళ్ల కుటుంబాల్ని కలిసి జరిగిన ప్రమాదం గురించి వైద్యులతో మాట్లాడి వాళ్లకి మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీమతి కాంతి శ్రీ గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవ్వట్లేదని తరచూ ఈ సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి భావితరాల పౌరుల బంగారు భవిష్యత్తు పైన శ్రద్ధ చూపాలని, ఇలాంటి సమస్యలు మళ్లీ మళ్లీ ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బార్నాల దుర్గరావు, సూర్య, బాబాజీ అలాగే సాయి, నిఖిల్, జయప్రకాశ్, తిరు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com