రాష్ట్రంలోని 2.48 లక్షల మంది రైతులు వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన 4 వేల రూపాయల కోట్లు తక్షణమే రైతులకు చెల్లించాలనే ప్రధానమైన డిమాండ్తో జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో ఆందోళన చేయడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు ప్రభుత్వం సుమారు 1450 కోట్ల రూపాయల బకాయి ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధాన్యం సేకరించిన మూడు రోజుల్లో రైతులకు వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని వాగ్దానం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట తప్పిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21రోజులలో ఆన్లైన్ పూర్తిచేసి రైతులకు బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం, నెలలు తరబడి బకాయిలు చెల్లించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఇటీవల కాలంలో రైతులు ఆందోళన చేయడంతో కొంతమేర వారి ఖాతాల్లో నగదు జమ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఇంకా జమ చేయకపోవడం చాలా దారుణమన్నారు. అసలే రబీ పంటకు వడ్డీలకు అప్పులు చేసిన రైతులు ఇప్పుడు తొలకరిలో వంటలు వేయడానికి అప్పుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారని అయినప్పటికీ ప్రభుత్వానికి రైతుల పట్ల జాలి లేదని తక్షణమే రైతులకు చెల్లించాల్సిన పూర్తి బకాయిలు చెల్లించాలని ప్రధానమైన డిమాండ్ తో అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ మరియు గోదావరి పార్లమెంటరీ కమిటీ జాయింట్ కన్వీనర్ శెట్టిబత్తుల రాజాబాబు గారి ఆధ్వర్యంలో అల్లవరం మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట, ఉప్పలగుప్తం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట, అమలాపురం రూరల్ మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట, అదేవిధంగా పట్టణంలోని ఆర్డిఓ ఆఫీస్ కార్యాలయం ఎదుట నిరసన నిరసన తెలియజేసి విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచులు ఉప సర్పంచులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.