కాకినాడ, (జనస్వరం) : ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఎయిడ్ కొనసాగించాలని ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన లాఠీ ఛార్జ్ ను తీవ్రంగా ఖండించిన తూర్పుగోదావరి జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి గారు. అలాగే లాఠీఛార్జ్ లో గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించడం జరిగింది. సుంకర కృష్ణవేణి గారు, జనసేన పార్టీ వార్డ్ మెంబర్ మలిరెడ్డి బుచ్చిరాజు, జనసైనికులు సతీష్ కుమార్, శ్రీనివాస్ గార్లు మాట్లాడుతూ వారికి ధైర్యంగా ఉండమని భరోసా కల్పించి, వారికి తోడుగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు సామాన్య కుటుంబాల విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాలంలో విద్యార్థులపై ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేసారు. చదువు కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులను, వారి కుటుంబాలను పోలీసులతో భయభ్రాంతులకు గురి చేయించడం మానుకోవాలన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు T. రాజా ఇతర నాయకులు,జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com