Logo
Date of Publish : 09 December 2021, 3:35 pm
Editor : Sake Naresh

వితంతు పెన్షన్ నిలిపివేతపై ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడ్డ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి

    కడియం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కడియం మండలంలోని, పొట్టిలంక గ్రామానికి చెందిన వీరగనుకులనే వితంతు మహిళ తన భర్త 25 సంవత్సరాల క్రితం చనిపోతే, ఐదు నెలల కిందటి వరకు పెన్షన్ వచ్చేది. కానీ ఏవో కుంటి సాకులు చెబుతూ ఆమె వితంతు పింఛన్ ను  అధికారులు ఈ మధ్య కొద్ది రోజుల క్రితం తీసివేశారు. కారణం ఏమిటంటే ఆమె భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ కావాలని కోరడంతో ఆమె అవాక్కై, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి జనసైనికుల సాయంతో ఆమెకు డెత్ సర్టిఫికెట్ నమోదు చేయించి పత్రము తీసుకువచ్చారు. ఈ విషయాన్ని రాజేశ్వరి ప్రెస్ కు తెలియజేస్తూ ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇటువంటి వారు ఇబ్బందులు పడుతూ చాలా మంది అనేక గ్రామాల్లో ఇంకా  ఉన్నారని, వాలంటీర్ వ్యవస్థ దేనికి ఉన్నదని ఇలాంటి వారిని బాధ పెట్టడం ఎంతవరకు న్యాయమని, కొన్ని ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ప్రభుత్వ పాలన పై లోపాలను, అవినీతి సమస్యలను, సూటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సంధించారు. అధికారుల లోపాలను ఎత్తి చూపుతూ ఆమె ప్రెస్ మీడియాకు తెలియజేసినారు. ఈ విషయం మీద పలువురు పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సమాజంలో ఇలా నిలదీసే వారు ఉండాలని సమస్యల మీద స్పందించి నేతలు ముందుకు రావాలని, ఇలాంటి వారు ప్రశ్నించడానికి ముందుకు వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని పలువురు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com