రాజోలు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల దగ్గర అభయ హస్తం సంవత్సరానికి 385 రూపాయలు తీసుకున్న అభయ హస్తం రద్దు చేశారంటూ రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో సున్నా వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆనంద్ రాజు మాట్లాడుతూ అభయ హస్తం పథకాన్ని మళ్లీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాలను బలోపేతం చేయడానికి మహిళా అండగా ఉండేందుకు అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరు గార్చిందని దుయ్య బట్టారు. మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంచుకుని అభయ హస్తం పథకాన్ని మరోసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డ్వాక్రా మహిళలకు అభయ హస్తం ఉన్న మహిళలకు ఎవరైనా మరణించినా వారికి ఆర్థికంగా భరోసా కల్పించాలని, గతంలో ఎవరైనా మరణించిన 30,000 వేల రూపాయలు ఇచ్చేవారని అది ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయాన్ని అమలాపురం ఎంపీ అనురాధ తో చర్చించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com